రాజకీయం కోసం కక్షగట్టి.. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని కుటుంబ సభ్యుల దగ్గర సోమవారం ఉదయం కోడెల ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేనని ఉదయం కూడా సన్నిహితుల ముందు కోడెల బాధపడ్డారని సమాచారం.
హైదరాబాద్: కొన్ని రోజులుగా కోడెల తీవ్ర మానసిక వేదనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇలా ఉంటే.. రెండు వారాల కిందట కూడా కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో అప్పట్లో ముప్పు తప్పిందని సన్నిహితులు తెలిపారు. మానసికంగా డీలాపడి, ప్రభుత్వం చేస్తున్న వేధింపుల గురించే కుటుంబ సభ్యులతో కోడెల చివరిగా మాట్లాడినట్లు తెలిసింది. ఉదయం ఏడున్నర సమయంలో కోడెల ఉరేసుకున్నారని, బట్టలు ఆరేసే తాడుతో బెడ్ రూమ్‌లో ఉరేసుకున్నారని ప్రాథమిక సమాచారం.