బీఆర్ఎస్ సర్కార్ పై ప్రొఫెసర్ కోదండ రాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వక్ఫ్ బాధితులు భయపడవలసిన అవసరం లేదన్నారు.
బాధితులతో పాటు తాము కూడా కలిసి ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డ్ బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి.
ఈ రిలే నిరహార దీక్షల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…బోడుప్పల్ లో 300 ఎకరాల భూమిలో 19 కాలనీలు వెలిశాయని, 7వేల కుటుంబాలు ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటాయన్నారు.
ఆ భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవని ప్రభుత్వం జీవో జారీ చేయడం చాలా అన్యాయమని ఆయన పేర్కొన్నారు. బోడుప్పల్‌లో వక్ఫ్ బోర్డు భూములను ఎత్తివేసి వారికి యాజమాన్య హక్కులను కల్పించే వరకు బాధితుల తరఫున టీజేఎస్ తరఫున పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.