విజయవాడ: కోడి కత్తి శ్రీనివాస్‌ని సూసైడ్ చేసుకోమని ఎవరైనా వత్తిడి తెస్తున్నారా? లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారా? జైలు వార్డెన్ అక్కడ పనిచేసే గార్డుతో కలిసి తన తమ్ముణ్ని బెదిరిస్తున్నారని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు తీవ్ర ఆరోపణ చేశాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న తన తమ్ముడు శ్రీనివాస్‌ను చూడ్డానికి అక్కడికి వెళ్తే.. అతని దవడ వాచి రక్తం కారిన గాయాన్ని చూసి అడిగానని, వార్డెన్ తనను తీవ్రంగా కొట్టి చచ్చిపోమని వత్తిడి తెస్తున్నాడని శ్రీనివాస్ తనకు చెప్పినట్టుగా సుబ్బరాజు ఒక వీడియోలో వివరించాడు. ఇంకా అతను ఏమన్నాడో ఆ వీడియోలో వినండి..