టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ వివాహ బంధానికి మూడేళ్లు పూర్తయ్యాయి. విరుహ్క వివాహబంధం ద్వారా ఒక్కటైన ఈ రోజున ట్విట్టర్ వేదికగా తన భార్యకు కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. వివాహ సమయంలో అనుష్క నవ్వుతూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ… కలకాలం కలిసుండే జంటకు పెళ్లై మూడేళ్లు ముగిసింది అని క్యాప్షన్ ఇచ్చాడు.
3 years and onto a lifetime together ❤️ pic.twitter.com/a30gdU87vS
— Virat Kohli (@imVkohli) December 11, 2020
Advertisements
కోహ్లీ ట్వీట్‌కు స్పందించిన అనుష్క శర్మ… తమ వివాహ బంధానికి మూడేళ్లు నిండడంపై సంతోషం వ్యక్తం చేసింది. మూడేళ్ల బంధం.. త్వరలో ముగ్గురం అని తను తల్లి కాబోతున్న విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో కోహ్లీతో ఉన్న ఫొటో పోస్టు చేసింది. కోహ్లీని బాగా మిస్ అవుతున్నట్లు పేర్కొంది.
జనవరిలో అనుష్క పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్… టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ అనంతరం భారత్‌కు రానున్నాడు.