టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఇంటివాడు అయ్యాడు. ముంబైలోని అలీబాగ్ లోని ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ చేపట్టిన లగ్జరీ బంగ్లా ప్రాజెక్టు ఆవాస్ విలేజ్‌లో ఒక ఇంటిని కోహ్లీ కొన్నాడు. చాలా అందంగా నిర్మించిన ఈ ఇళ్లకు సెలెబ్రిటీల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు ప్రాజెక్టు నిర్వాహకులు చెప్తున్నారు.
ఇది ముంబై కి సమీపంలో ఉండే ఒక అందమైన గ్రామం. ఇక్కడనుండి స్పీడ్ బోట్ ద్వారా ముంబై కి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ హౌస్‌ను రూ.6 కోట్లు పెట్టి ఈ జోడీ కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి చేయాల్సిన ఫార్మాలిటీస్‌ను కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ పూర్తిచేశారట.
స్టాంప్ డ్యూటీ కింద రూ.36లక్షలు చెల్లించారట. ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసింది హృతిక్ మాజీ భార్య సుసానె ఖాన్ అని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఇంట్లో 400 స్క్వేర్ ఫీట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట. అంతే కాదు అలీబాగ్ పరిసర ప్రాంతాల్లో భవిష్యత్ లో 250 ఎకరాల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. వీకెండ్ డెస్టినేషన్స్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది.
అంతేగాక త్వరలో ఈ ప్రాంతం ఒక స్పెషల్ హబ్ గా మారే అవకాశం కూడా ఉండనుండడంతో ఇప్పుడు ఈ లక్జరీ విల్లా విరాట్ కోహ్లీ కొన్నట్లు వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా, అలీబాగ్ లో కోహ్లీకి ఇది రెండో ప్రాపర్టీ. 2022 సెప్టెంబర్ లోనే కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి జీరాద్ గ్రామంలో 19.24 కోట్లకు ఓ లగ్జరీ ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేశారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే అలీబాగ్‌లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొన్నాడు.