ఐపీఎల్ 2022 సీజన్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫీల్డింగ్‌లో మాత్రం కేక పెట్టించాడు. కళ్లు చెదిరే తన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని సూపర్ క్యాచ్‌కు దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా ఢిల్లీ పై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు, కోహ్లి క్యాచ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 134/5తో నిలిచింది. మ్యాచ్ ఆసక్తిగా సాగుతున్న వేళ.. 17వ ఓవర్ వేయడానికి మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. అప్పటికి రిషభ్ పంత్ 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. పంత్ దూకుడు చూస్తే ఢిల్లీ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లే కనిపించింది. దీంతో బెంగళూరు టీమ్‌లో కంగారు కనిపించింది.
ఒత్తిడికి గురైన సిరాజ్ మూడో బంతిని లో ఫుల్ టాస్ రూపంలో విసరగా.. రిషబ్ పంత్ కవర్స్ దిశగా విరాట్ కోహ్లీ తలపై నుంచి బౌండరీ కోసం బంతిని హిట్ చేశాడు. గంటకి 137కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని రిషబ్ పంత్ చక్కగా కనెక్ట్ చేయడంతో.. కోహ్లీ తలపై నుంచి బంతి బౌండరీకి వెళ్లేలా కనిపించింది.
కానీ, కోహ్లీ క్షణకాలంలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ బిత్తరపోయి నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కోహ్లీ మాత్రం ఆ క్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్క శర్మ వైపు విక్టరీ సింబల్ చూపిస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.
The one-handed catch by KING KOHLI! 🔥😱#ViratKohli #IPL2022 pic.twitter.com/4dJizYEiup
— Jay (@bhavsarJ2_0) April 16, 2022
Advertisements