ఐపీఎల్ లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ గెలుపుతో 14 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ లో నిలించింది ధోనీ సేన. అయితే మ్యాచ్ అనంతరం ధోనీ, కోహ్లీ మధ్య ఓ ఆసక్తికర సీన్ కనిపించింది.
సహచర క్రీడాకారులతో కలిసి ధోనీ మాట్లాడుతున్న సమయంలో కోహ్లీ వెనుకనుంచి వెళ్లి హగ్ చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కాసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కోహ్లీ, ధోనీ మధ్య విభేదాలు ఉన్నాయని ఫ్యాన్స్ అప్పుడప్పుడు తిట్టుకోవడం చూస్తున్నాం. టీ-20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడానికి కారణం.. ధోనీని మెంటార్ నియమించడమేననే విమర్శలు వచ్చాయి. అయితే తాజా సంఘటనతో తాము మాత్రం మంచి స్నేహితులమేననే సంకేతాన్ని ఫ్యాన్స్ కు పంపారు కోహ్లీ, ధోనీ.