సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా విషయంలో టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కొహ్లి బవుమాపై అసభ్యరీతిలో కామెంట్స్ చేయడం స్టంప్ మైక్ లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కేఎల్ రాహుల్ డైరెక్ట్ త్రోకు టెంబా బవుమా రనౌట్ అయ్యాడు.
పెవిలియన్ వెళ్తున్న బవుమాను ఉద్దేశించి కొహ్లి.. బాగ్ రహా తా మద్.. అంటూ బూతు మాటలు పలికాడు. కొహ్లి పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు కూడా ఏం పట్టనట్లే ఉన్నారు. అయితే.. ఇదంతా స్టంప్ మైక్ లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక.. తొలి వన్డేలో బవుమా, కొహ్లి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పంత్ కు త్రో వేయబోయిన బంతి బవుమాకు తగలడంతో.. అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. బదులుగా కొహ్లి అతనిపై కోపం చూపించడంతో అది కాస్త రచ్చగా మారింది. అదే గొడవ ఇప్పటికి ఇద్దరి మధ్య వైరంగా నడిపిస్తూనే ఉంది.
Advertisements
తాజా అంశంలో అందరూ కొహ్లినే తప్పుబడుతున్నారు. ఇప్పటికే జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్ గమ్ నమిలి అనుచితంగా ప్రవర్తించిన కొహ్లిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా చర్యతో కొహ్లిపై మరింత ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.