భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్య ఫ్యాన్స్ కు పెద్ద పెద్ద షాకులే ఇస్తున్నాడు. మొన్నీమధ్య టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీ-20 టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న కోహ్లీ… 2021 సీజన్ వరకు మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతానని తాజాగా ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. దాన్ని ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సీజన్ తర్వాత కేవలం ఆటగాడిగానే ఉంటానని స్పష్టం చేశాడు కోహ్లీ.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021
Advertisements
తన నిర్ణయాన్ని అభిమానులంతా స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయితే కోహ్లీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని.. కొందరు పునరాలోచించుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.