బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఐపీఎల్ టీం కోల్‌కత్తా నైట్ రైడర్స్ మరోసారి కెప్టెన్సీ మారబోతుందా…? సక్సెస్‌ఫుల్ కెప్టెన్ గంభీర్‌ను పక్కనపెట్టి చేతులు కాల్చుకున్న షారూఖ్ ఇప్పుడు కొత్త రక్తం తెచ్చే ఆలోచనలో ఉన్నారా…? దినేష్ కార్తీక్ ఫెయిల్ అవ్వటంతో మార్పు తప్పదా…?
ఐపీఎల్ 2020 సీజన్‌కు టైం దగ్గరపడుతుండటంతో…ప్రాంచైజీలన్నీ తమ తమ వ్యూహాలను, అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే, కెప్టెన్‌ను మార్చి చేతులు కాల్చుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ యాజమాన్యం… ఈ సంవత్సరం కూడా కెప్టెన్‌ను మార్చబోతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2020 సీజన్‌కు గురువారం క్రికెటర్ల వేలం జరగనుండగా… వేలం తర్వాత కెప్టెన్సీ మార్పుపై జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన వెలువరించబోతున్నట్లు తెలుస్తోంది.
రెండు సార్లు కోల్‌కత్తాకు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్‌ను మార్చేసి, ఆ స్థానంలో దినేష్ కార్తీక్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లి… బీజేపీ ఎంపీగా కూడా గెలుపొందారు. సో మళ్లీ గంభీర్ వచ్చి ఆడే అవకాశం లేదు. ఈసారి కొత్త కెప్టెన్‌గా కుర్రాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
అండర్ 19 క్రికెట్‌లో తన ప్రతిభ చూపించి… మంచి పేరు తెచ్చుకున్న శుభమన్ గిల్ వైపు షారుఖ్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త కుర్రాడు… కొత్త ఆలోచనలతో జట్టును గాడిలో పెట్టే అవకాశం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డారు.