కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ పేరును డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ గా మార్చారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ బీజేపీ పూర్వ సంస్థ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు.ఆదివారం మధ్యాహ్నం కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వారోత్సవాలను ప్రధాన మంత్రి ప్రారంభించిన అనంతరం పేరు మార్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒకే దేశం..ఒకే రాజ్యాంగం కోసం పోరాడిన వాళ్లలో ముందున్న నేతగా కొనియాడారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో పారిశ్రామికీకరణకు పునాది వేశారన్నారు. చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, హిందుస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, దామోదర్ వ్యాలీ కార్పోరేషన్, ఇతర ప్రాజెక్టల ఏర్పాటులో ఆయన చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనాల్సి ఉండగా ఆమె రాలేదు.