తమిళ నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిని వెళ్లగొట్టాలని కాంట్రావర్సీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ తమిళనాట సంచలనంగా మారాయి.
ఓ డైరెక్టర్ తన ఫోటోను పర్మిషన్ లేకుండా వాడాడని చెబుతూనే… దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పింది. షెడ్యూల్ కులాల వారి కారణంగానే గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. వాళ్లందరినీ వెళ్లగొడితే.. క్వాలిటీ సినిమాలు వస్తాయని చెప్పుకొచ్చింది.
మీరా వ్యాఖ్యలను వీఎస్కే పార్టీ సీరియస్ గా తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దళిత సంఘాలు కూడా మీరా కామెంట్స్ పై మండిపడుతున్నారు.