తమిళ్ స్టార్ హీరో విశాల్ ను తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. విశాల్ కు తెలుగు రాష్ట్రాలలో కూడా మార్కెట్ బాగానే ఉంది. అయితే ఈ తమిళ హీరో ఇప్పుడు విలన్ గా మారబోతున్నారు. కానీ… అది ఇక్కడ కాదు. బాలీవుడ్ లో. 2018లో విశాల్ హీరోగా వచ్చిన తమిళ వెర్షన్ ఇరుంబు తిరాయ్ సినిమాను తెలుగులో అభిమన్యుడు గా రీమేక్ చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు వసూళ్లను కూడా బాగానే రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. అందులో విశాల్ పాత్రలో సోనూసూద్ చేయబోతున్నారని అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రలో విశాల్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే. ఇక ప్రస్తుతం విశాల్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.