కరోనా మహమ్మారి మానవాళి పై విరుచుకుపడుతుంది. లక్షల సంఖ్యలో ప్రాణాలను తీస్తుంది.చిన్న పెద్ద డబ్బు ఉన్నడు, లేనోడు అనే తేడా లేకుండా తన పని చేసుకుంటూ పోతుంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ సినీ ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే పలువులు సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందగా తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత స్వామినాథన్ కరోనా కారణంగా మరణించారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ మూవీ మేకర్స్ లో స్వామినాథన్ కూడా ఒకడు. ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కె మురళీధరన్, వేణుగోపాల్ భాగస్వాములుగా ఉన్నారు.