జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగు రోడ్డు విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఛైర్మన్ కి వివరించిన కోమటిరెడ్డి. అవసరానికి మించి భూ సేకరణ జరుగుతుందని ఆయన వివరించారు. దీని వలన ఎంతో మంది పేదలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
దీని కోసం ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు కూడా జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ భూ సేకరణ విషయంలో ఎన్నో తరాల నుంచి వస్తున్న భూములను కోల్పుతున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. అవసరం లేకపోయినప్పటికీ భూములు సేకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను గుర్తించాలని తెలిపారు.
డిజైన్ ఇంకా అప్రూవల్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 500 కోట్లు ఇంకా చెల్లించనేలేదు. అంతలోనే చాలామందిని రోడ్డున పడేశారు. గతంలో ఈ విషయం పై చర్చించేందుకు ఐదారు సార్లు చైర్మన్ ని కలిశాను. పార్లమెంట్ లో కూడా ఈ అంశం గురించి లేవనెత్తాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించారు.
ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ మార్చాలి. ఈ విషయాలన్నింటి గురించి చైర్మన్ తో మాట్లాడాను. ఎంత అవసరమో అంతే భూమిని తీసుకోవాలని, పేదలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి కోరినట్లు ఆయన వివరించారు.