కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పార్లమెంట్ సభ్యులు భువనగిరి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డివెంకటరెడ్డి గారు…
తెలంగాణ రాష్ట్రంలో కరోన మహమ్మరిమి అరికట్టడానికి ప్రతిపక్ష పార్టీ గా మా వంతు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి కి తెలియపరిచాం..రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నందువల్ల రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మేము రాజకీయ విమర్శలు చేయలేదు కానీ నేడు ఆర్థిక లోటు పేరు తో ప్రభుత్వ ఉద్యోగుల పొట్టమీద కొట్టడం కాంగ్రెస్ పార్టీ తరుపున ఖండిస్తున్నము
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కామెంట్స్
కరోన కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలిసిన ఐ ఆర్,పి ఆర్ సి ఇవ్వకుండా వేతనాలను 50 శాతం కోత విధించడం ఏమిటి
మీ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలా తయారు అయింది*
ప్రాజెక్ట్ ల పెరు మీద కమిషన్లు దండుకొని ఇప్పుడు ఉద్యోగులకు వేతనాలు కోత విధిస్తారా
రాష్ట్రంలో వారం రోజుల లాక్ డౌన్ కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా
ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు..మరి వాటిని ఎలా ఎదురుకుంటారు
ఇలా ఉద్యోగుల వేతనాలు 50 శాతం,4th క్లాస్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం కట్ చేస్తున్నారు కాదా మరి ఇలాంటి ఆర్ధిక పరిస్థితి ఉన్నపుడు కొత్త సచివాలయం నిర్మాణం చేస్తామని ఎలా చెప్పుతున్నారు
ధనిక రాష్ట్రం ఆర్ధిక వనరులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటే నమ్మము
మరి ఇలా ఉద్యోగుల వేతనాలను కోత పెట్టడం ఎంత వరకు సమంజసం
రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ లో కూడా 50 శాతం కోత విధించడం ఏమిటి
వాళ్లకు ఎన్నో అవసరాలు ఉంటాయి..వాళ్లకు ఆరోగ్యపరమైన ఖర్చులు ఉంటాయి
ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇలాంటి కోతలు విధించి సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు
ప్రవేట్ కంపిని వాళ్ళు ఇన్ని రోజులు కంపెనీలు నడవలేదు ఉత్పత్తి లేదు ఎలా వేతనాలు చెల్లిస్తామని ప్రవేట్ ఉద్యోగులను అడుగరా
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కోత విధించారు మీకు ఎలా వేతనాలు ఇవ్వాలని ప్రవేట్ ఉద్యోగులను ఆయా యాజమాన్యాలు అంటే ఎవరు బాధ్యత వహిస్తారు
ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు తీసుకవచ్చారు
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
వెంటనే ఉద్యోగుల వేతనాల కోతను ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగైదు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను రుపొందిస్తోంది.
ప్రత్యేక విమానంలో తిరుగుతూ ధనిక రాష్ట్రం అని చెప్పుతుంటే అందరం నమ్మినాము
ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే KCR ఇపుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉంది
మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు
రాష్ట్రం ఎటు పోతుందో అన్న భయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు
కరోన పై ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా..
మిరే చట్టం చేసి మిరే అతిక్రమిస్తారా
పెన్షన్ తో జీవితాన్ని గడుపుతున్న వారికి మీ నిర్ణయం తో రోడ్డు మీద పడతారు
కొన్ని నెలలు కరువు విలయతాండవం చేసిన ఆర్థిక లోటు రాదు
ఆలాంటిది కేవలం 8 రోజుల లాక్ డౌన్ కె ఆర్థిక లోటు వచ్చిందా
మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మీ ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పుల రాష్ట్రం గా మార్చారు
KCR ఆర్థిక లోటు పేరుతో ప్రజల నెత్తిపై బండ రాయి వేశారు
డిమైండ్స్:-
KCR పునరాలోచన చేసుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగులందరికి జీతాలు మొత్తం ఇవ్వాలి
వారం లోగా ఆర్ధిక లోటు పై శ్వేత పత్రం విడుదల చేయాలి
కరోన పై ఇప్పటివరకు పెట్టిన ఖర్చును వెంటనే ప్రకటించాలి
అవసరం అనుకుంటే సమాచారహక్కు చట్టం తో అయిన సమాచారాన్ని సేకరిస్తాం
మరోసారి రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తాం
తెలంగాణ ప్రజల కోసం ఏమిచేయటానికి అయిన నేను సిద్ధంగా ఉంటాను