కేసీఆర్ సర్కార్‌పై కోమటిరెడ్డి గ్రాండ్ విక్టరీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టు లో ఊరట లభించింది. వీరిద్దర్నీ ఎమ్మెల్యేలు గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సదరు ఎమ్మెల్యేల సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఎలాంటి ప్రివిలైజెస్ వాళ్లకు ఉన్నాయో అన్నింటినీ కొనసాగించాలని కూడా కోర్టు పేర్కొంది.

గడచిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్న సమయంలో కోమటిరెడ్డి మైక్ విరిచి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మీదకు విసిరిన ఘటన అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.