పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చారు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే. కోమటిరెడ్డి వ్యాఖ్యల దుమారం చెలరేగడంతో దీనికి ఫులిస్టాప్ పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోమటిరెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వీరిద్దరి భేటీకి వేదికైంది.
పొత్తులపై మంగళవారం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. తొలుత రాష్ట్రంలో హంగ్ వస్తుందన్న ఆయన తర్వాత తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడ్డారు. ఇవి పార్టీకి నష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం మరింత ముదురుతుండడంతో కొత్త ఇంచార్జ్ కు ఈ ఎపిసోడ్ సవాల్ గా మారింది. కోమటిరెడ్డిని కట్టడి చేస్తారా? కఠినంగా వ్యవహరిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై థాక్రే ఏవిధంగా స్పందించనున్నారో అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వెంకట్ రెడ్డితో భేటీకి ముందు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ కార్యదర్శులతో థాక్రే భేటీ అయ్యారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారితో చర్చించారు.