మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి? అంటూ మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
” పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టీఆర్ఎస్ కా…? ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా…? పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకా” అంటూ ఆయన అడిగారు.
మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి?
పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టిఆర్ఎస్ కా…?
ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా…?
పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బిజెపి కా…?— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 4, 2022
అయితే నిన్న మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో… మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? అంటూ ఓ ట్వీట్ చేశారు.
” ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్ కా? ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీకా? ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ కా? ” అంటూ ప్రశ్నించారు.
మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ?
ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్
ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ
ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస
— KTR (@KTRTRS) October 3, 2022
నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారినుండి కాపాడింది టీఆర్ఎస్ పార్టీ నే అని కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 7న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
ఆరోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరితేదీ అక్టోబర్ 14. స్క్రూటినీ 15న ఉండనుంది. అక్టోబర్ 17న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న ఎన్నిక, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.