టీఆర్ఎస్ నేతలపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు మనుషులను పెట్టి తమ సభలను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ ప్రజలంతా తమ పార్టీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పార్టీ మారాలంటూ బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా టీఆర్ఎస్‌ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వెయ్యి కోట్ల నిధులు తీసుకు వచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.