ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పులి లాంటిదని, మిమ్మల్ని మింగుతదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అవినీతి పాలనపై పోరాడేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ మునుగోడులో అడ్డదారిలో గెలిచారని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన అవినీతి ఏ సీఎం చేయలేదని ఆరోపించారు. నిజమైన కురుక్షేత్ర యుద్ధం ముందు ఉందని.. ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. రైతు బంధు తప్ప మిగతా పథకాలన్నీ ఆపేశారు. ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు.
బడిలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారం, డబ్బుతోనే బీఆర్ఎస్ గెలుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం రావాలంటే.. ఉమ్మడి జిల్లాలో పది సీట్లు గెలిచే బాధ్యత మీపై ఉందన్నారు.
ఈటెల రాజేందర్ ఉద్యమంలో ఉన్నప్పుడు.. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. తండ్రి తర్వాత కేటీఆర్ సీఎం కావాలని చూస్తున్నాడు. పోరాటం అపోద్దని, మునుగోడు ఎలక్షన్ లో గెలిచామనుకొని ముందుకు వెళ్లాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.