కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ గౌరెల్లి నుంచి కొత్తగూడెం ఎన్. హెచ్. 30వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారికి ఎన్.హెచ్. నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలి. నూతనంగా మంజూరైన ఈ జాతీయ రహదారి వల్ల హైదరాబాద్ – వైజాగ్ పోర్టు, హైదరాబాద్ – చత్తీస్‌ఘడ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌లను ఆహ్వానించగా ఇప్పటి వరకు ఈ డీపీఆర్‌లకు అనుమతి ఇవ్వలేదు.
దాదాపు 100 కిలోమీటర్లకు పైగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గుండా ఈరహదారి వెళుతుంది. ఈ రోడ్డు గిరిజన ప్రాంతాల నుంచి, రెండు జిల్లా కేంద్రాలు మహబూబాబాద్, కొత్తగూడెం గుండా వెళుతుంది. ఈ రోడ్డు పూర్తయితే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుంది. ఈ రహదారికి వెంటనే ఎన్. హెచ్. నెంబర్ కేటాయించి.. డీపీఆర్‌లకు అనుమతులు ఇచ్చి… నిధులు కేటాయించేలా సంబంధిత శాఖకు ఆదేశాలు జారీచేయాలి.