ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. నిరుద్యోగులకు శుభవార్త చెబుతాను అని సీఎం చెప్పడంతో తాను రాత్రంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తూ గడిపానన్నారు. తీరా ఉదయం 10 గంటలకు చూస్తే ఆయన ప్రకటన తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఖాళీలు ఉన్నట్టు సీఎం నియమించిన బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ.. 91వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అనడం సరికాదన్నారు.
ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్స్ సోర్సింగ్ విధానమే ఉండదని కేసీఆర్ అన్నారని.. కానీ.. కేవలం 11 వేల మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తానని ప్రకటించడంతో చాలా బాధ అనిపించిందని చెప్పారు.
ఆర్థిక పరిస్థితి బాగాలేనందు వల్లే భృతి ఇవ్వలేమని నిరోద్యోగులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి.