తాను చనిపోయినప్పుడు మూడు రంగుల జెండాను తన పార్ధివదేహం మీద కప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రేవంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌ఎస్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తనది ఒకటే మాట.. ఒకటే బాట అని అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసీఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై అబద్దఫు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధిని శంకించేలా, వ్యక్తిత్వ ఖననానికి పాల్పడడం సరికాదన్నారు.
అభివృద్ధి కోసం పోరాడతానని.. బొగ్గు గనుల కుంభకోణంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి సమస్యలు లేవని అందరం కలసికట్టుగానే ఉన్నామని.. అధిష్టానం నిర్ణయాలతోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి.