తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని అన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని జోస్యం చెప్పారు.
తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయన్నారు. ఆయన గెలిపిస్తాడంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి కామెంట్స్ చేశారు.
మార్చి ఫస్ట్ వీక్ లో యాదగిరి గుట్ట నుంచి తన పాదయాత్ర మొదలు పెడతానని వివరించారు. రాష్ట్ర ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.