రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనను కోమటిరెడ్డి వ్యతిరేకించడంతో కాంగ్రెస్ మళ్లీ మొదటికొచ్చిందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డిని చల్లబరిచే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఇంటికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వెళ్లడం ఇంట్రస్టింగ్ గా మారింది.
భేటీ అనంతరం మాట్లాడిన ఠాగూర్.. పార్టీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కోమటిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని తెలిపారు. స్టార్ క్యాపెయినర్ గా ఉన్న ఆయన్ను, రాష్ట్ర ఇంఛార్జిగా ఉన్న తాను కలవడం సహజమేనని చెప్పారు. పలు అంశాలపై చర్చించినట్లు వివరించారు.
నేతలందరూ రాహుల్ గాంధీ సభ సన్నాహాల్లో బిజీగా ఉన్నారన్నారు మాణిక్కం ఠాగూర్. అయితే.. ఉమ్మడి నల్గొండ సన్నాహక సమావేశానికి ఎందుకు వెళ్లలేదో కోమటిరెడ్డి.. ఠాగూర్ కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం.
కోమటిరెడ్డితో భేటీ తర్వాత బోయినపల్లిలో ఉన్న పార్టీ స్థలాన్ని ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో కలిసి మానిక్కం ఠాగూర్ పరిశీలించారు. అక్కడే పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ భావిస్తోంది.
With working president @AnjanKumarMP , Ex PCC president @PonnalaLaksmiah with my AICC secretaries @NsBoseraju Srinivasan and friends in the land of fighters … warangal.. pic.twitter.com/fFNLmaXcGS
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) April 30, 2022
Advertisements