930 పి నెంబర్ గల జాతీయ రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. కొత్తగా హైవే వేయడం ద్వారా వైజాగ్ పోర్ట్ నుండి ఛత్తీస్ గఢ్ మీదుగా హైదరాబాద్ కు చేరడానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ హైవే గోదావరి నది ఒడ్డు మీదుగా వెళ్తుంది. అక్కడ ఇరుకగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టాలంటే హైవే పూర్తి చేయాలని కోరారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించినట్లు కోమటిరెడ్డి తెలిపారు.