వరి ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తుంటే.. హైదరాబాద్ లో బీజేపీ ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.
రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని శపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే.. చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతోందని హెచ్చరించారు. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరని దైర్యంతో దొంగవేషాలు వేస్తున్నారని మండిపడుతున్నారు.
రైతుల కోసం పోరాటాలు చేసే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ లు చేయిస్తున్నారని మండిపడ్డారు. దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
Advertisements
ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వేశాలు మాని రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.