తను గతంలో గంజాయి స్మగ్లింగ్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు రచయిత కోన వెంకట్. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఫ్రెండ్ ను ఆదుకునేందుకు తను స్వయంగా గంజాయి స్మగ్లింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించాడు.
కోన వెంకట్ ఫ్రెండ్ ఒకడు బాగా కష్టాల్లో ఉన్నాడట. దాన్నుంచి బయటపడేందుకు గంజాయి సాగుచేశాడంట. ఆ గంజాయిని గోవాకు తరలించి అమ్మాలనేది అతడి ప్లాన్. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకున్నాడట.
ఆ టైమ్ లో కోన వెంకట్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఆ గంజాయిని గోవా తరలించారట. కోన వెంకట్ తండ్రి స్వయానా డీఎస్పీ కావడంతో, అతడి వాహనంలో గంజాయిని 3 చెక్ పోస్టులు దాటించి గోవాకు స్మగ్లింగ్ చేశారు. దాన్ని అమ్మి, ఆ డబ్బును ఫ్రెండ్ కు ఇచ్చారంట.
ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ఈ రచయిత. తన అనుభవాలతో ఓ సినిమా తీయాలని తనకు ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఇన్ని విషయాలు చెప్పిన కోన, స్మగ్లింగ్ తప్పు అంటున్నాడు