కొండా మురళి
మాజీ ఎమ్మెల్సీ,కాంగ్రెస్ నాయకులు
రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రపంచంలోనే గొప్ప పాదయాత్ర. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పట్టుదలతో పాదయాత్ర చేశాడు. నేను ఎర్రబెల్లి దయాకర్ రావు లాగా మాయమాటలు చెప్పను. మేము ఎప్పుడైనా అలా చెప్పామా?.. మీరు ఆలోచించాలి? మాకు రాజకీయాలు ముఖ్యం కాదు…ప్రజా సేవా ముఖ్యం.వరంగల్ పశ్చిమ,వరంగల్ తూర్పు నియోజకవర్గలలో భూ కబ్జాలు చూస్తే భాద అనిపిస్తోంది.
వరంగల్ సీపీ కీ సెల్యూట్…ఇలానే ఆయన పని కొనసాగాలి. చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు…అక్కడ ఇలానే పని చేయవచ్చు.రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. కవిత జాగృతి అని పెట్టారు..జాగృతికి తాగుబోతులను తయారుచేయడమే లక్ష్యం. కవిత లిక్కర్ స్కామ్ కు తెరలేపింది.
తండ్రి తాగుడు చూసి కవిత లిక్కర్ స్కామ్ లో అడుగుపెట్టింది.సేవా కార్యక్రమలతో మేము రాజకీయాలు చేస్తాం.
వరంగల్ తూర్పు కొండా సురేఖ నిలబడుతుంది,గెలుస్తుంది. రెండు,మూడు సీట్లు అడుగుతున్నారనేది ప్రచారం చేస్తున్నారు.మాకు ఒక్క టికెట్ చాలు.
నేను నికార్సైన కొండా మురళిని..ఎర్రబెల్లి లాగా మాయమాటలు చెప్పను.మా కూతురు ఈసారి పోటీ చేయదు..ఇప్పుడున్న రాజకీయాలలో ఉండదురాహూల్ గాంధీ స్పూర్తితో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోజుకోక డివిజన్ లో పాదయాత్ర చేస్తాం.
మమల్ని ప్రజలు ఆదరిస్తారు..మేము ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు. నాకు గోపాలపూర్ లో ఉన్న భూమినే కబ్జా చేశారు.. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేయించాడు.
కొండా మురళికీ తగిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే..రేవంత్ రెడ్డి తోనే మా ప్రయాణం.రేవంత్ రెడ్డి,కొండా సురేఖ ల పాదయాత్రలో పాల్గొంటాను