– కాలుష్య కోరల్లో భాగ్యనగరం
– ఇండియాలో నాలుగో స్థానం
– దక్షిణాదిన మొదటి స్థానం
– 2020 నుంచి 2021కి భారీగా పెరిగిన కాలుష్యం
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్ గా ట్వీట్స్ చేస్తుంటారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే.. హైదరాబాద్ లో భారీగా పెరిగిన కాలుష్యం గురించి వివరిస్తూ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు విశ్వేశ్వర్ రెడ్డి.
ఐక్యూ ఎయిర్ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగోస్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. నగరంలో 2020లో 34.7 ug/m3 ఉన్న లెవెల్స్ 2021కి 39.4 ug/m3 కి పెరిగినట్లు ఐక్యూ ఎయిర్ స్పష్టం చేసింది. మొత్తం 117 దేశాల్లోని 6,475 నగరాలపై ఈ సర్వే జరిగింది. ఇండియా వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది.
హైదరాబాద్ లో పచ్చదనం పెరిగిందని ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడమే గానీ.. అనుకున్నంత స్థాయిలో కాలుష్య నివారణను అడ్డుకోలేకపోతోందని ఈ సర్వేతో తేలిపోయిందంటున్నారు పర్యావరణ వేత్తలు. రానున్న రోజుల్లో ఢిల్లీ మాదిరిగా ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుందా? అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొండా వేశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
None of the STPs-Sewage Treatment Plants working to capacity
All lakes from Hussainsagar to Durgam Chervu in the City filled with Raw Sewage
4000 toilets boxes built for KCR & son Publicity in GHMC elections disappeared.
Industrial pollution unabated.@HiHyderabad@GHMCOnline pic.twitter.com/E9TwtilsEz
— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 23, 2022
Advertisements
మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీలు సామర్థ్యం మేరకు పనిచేయడం లేదన్నారు. నగరంలోని చెరువులన్నీ మురుగు నీటితోనే నిండిపోయాయని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన 4వేల టాయిలెట్స్ మాయం అయ్యాయని విమర్శించారు. అలాగే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కూడా తగ్గలేదని తెలిపారు విశ్వేశ్వర్ రెడ్డి.
ఈయన ట్వీట్ పై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ ను మరో ఢిల్లీ కానివ్వొద్దని కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. వాటికితోడు కాలం చెల్లిన వాటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దీనికితోడు ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న విష వాయువులు అదనం. ఈ క్రమంలోనే భాగ్యనగరం కాలుష్య కోరల్లో చిక్కుకుపోతోందని అంటున్నారు పర్యావరణవేత్తలు.