కాంగ్రెస్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను బయటకు రాకుండా ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
గృహ నిర్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డిని పార్టీ నేతలతో పాటు ఇతర నాయకులు కలుస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రేవంత్ ఇంటికి వెళ్లారు. ధాన్యం కొనుగోళ్లపై ఇద్దరూ చర్చించారు. రైతుల కోసం రేవంత్ చేస్తున్న పోరాటానికి కొండా మద్దతు తెలిపారు.