అదేంటి..? డెంగ్యూ వ్యాధికి, టీఆరెస్‌లో చేరటానికి ఎం సంబంధం? టీఆరెస్‌లో చేరితే డెంగ్యూ రాదా? కొత్త మెడిసిన్ ఏమైనా ఆ పార్టీ నేతలకు ఇస్తున్నారా…? ఇలాంటి డౌట్స్ రావటం సహజమే. ఈ ప్రశ్నలకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే..
టీఆరెస్ పార్టీలో నేతలకు, వారి బంధువులు ఎవరికి డెంగ్యూ జ్వరాలు రాలేదు. కొంతమందికి కేవలం వైరల్ ఫీవర్స్ మాత్రమే వచ్చాయి అంటూ కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితను ఉద్దేశించి కామెంట్ చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. డెంగ్యూ రాకుండా నిరోదించాలంటే టీఆరెస్‌లో చేరటం మేలు అని వెటకారంగా ట్విట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ సర్… ప్లీస్ మీరు కూడా మళ్లీ టీఆరెస్‌లో చేరండి అని ఉచిత సలహా పారేయడం ఓ కొసమెరుపు.
దీనికి సమాధానమిస్తూ…. కొండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కూడా టీఆరెస్ లోకి మళ్ళీ వెళ్ళటం పై సీరియస్ గానే ఉన్నాను. టీఆరెస్ శ్రేణులకు డెంగ్యూ రాకుండా వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్లుంది. అందుకే కనీసం ఈ డెంగ్యూ జ్వరాల సీజన్ వరకైనా టీఆరెస్ లో ఉండాలని ఉంది. కానీ టీఆరెస్ ఓనర్లు నాపై కోపంగా ఉన్నారు. నాలాంటి వారిని తిరిగి తీసుకుంటారా అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారుతుంది.