క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కు సంబంధించి విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఇప్పటి వరకు ఐదు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ లో కొనసాగుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వై. రాజీవ్ రెడ్డి, జే. సాయి బాబు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల కానుంది.