ప్రిన్స్ మహేష్ బాబు మూవీస్‌లో రియల్ థింగ్స్‌ను సెట్స్‌గా చూపడంలో ఓ స్పెషాలిటీ ఉంది. ఒక్కడు మూవీకి చార్మినార్, ఓల్డ్ సిటీ సెట్ వేసి అచ్చంగా అక్కడే షూట్ చేసినట్లు మైమరపించారు. ఆ సెట్ అదిరింది. మూవీ సూపర్ హిట్ అయింది. అలాగే అర్జున్ మూవీలో మధుర మీనాక్షి ఆలయ సెట్ అద్బుతంగా వేశారు. టెంపుల్ దగ్గరే షూట్ చేసిన అనుభూతి ప్రేక్షకులకు కలిగింది.
ఇప్పుడు తాజాగా కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు. రియల్ అనుభూతిని తెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదు. సూపర్‌స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ కోసం చిత్రయూనిట్ కొండారెడ్డి బురుజు రియల్ అద్భుతాన్ని ఆవిష్కరించింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజు క్రియేట్ చేశారు. ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నిర్మాత అనీల్ సుంకర ట్వీట్ చేశారు. గతంలో మహేష్ బాబు ఒక్కడు మూవీ కోసం ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో 16 ఏళ్ల క్రితం కొండారెడ్డి బురుజు సీన్ తెరపై అదిరిపోయింది. అయితే ఈసారి ఒక్క సీన్ మాత్రమే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాశ్‌తో పూర్తి స్థాయి సెట్ వేయించి కీలక సన్నివేశాలు తీస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో కొండారెడ్డి బురుజు ఉందేమిటబ్బా ! అన్న ఆశ్చర్యం కలుగుతోందని అనీల్ సుంకర ట్వీట్ ఇచ్చారు.
కొండారెడ్డి బురుజు సెట్ ముందు సూపర్‌స్టార్ మహేష్ బాబు నిలబడి ఉన్న ఫొటోను ప్రొడ్యూసర్ అనీల్ సుంకర షేర్ చేసి ఫాన్స్‌ను మురిపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధవుతోంది.