కూకట్ పల్లి హై టెక్ పేకాట రాకెట్ గుట్టురట్టు అయింది. లోధా అపార్ట్మెంట్స్ లో హై టెక్ పేకాట ఆడుతూ ఓ గ్యాంగ్ పట్టు పడింది. పక్క సమాచారం తో అపార్ట్మెంట్స్ లో దాడులు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. హై టెక్ పేకాట నిర్వహిస్తున్న నిత్యపు మురళి పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం లక్షన్నర రూపాయలకు లోధా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కు తీసుకున్నాడు మురళి.
సంపన్నులు నివసించే అపార్ట్మెంట్ లో స్వేచ్ఛగా వ్యవహారం కానిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆఫీస్ కు పిలిపించుకొని రోజూ లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఈ దాడిలో మొత్తం రూ. 2,52,140 తో పాటు.. 13 మొబైల్ ఫోన్స్, 10సెట్ల కార్డ్స్ ను సీజ్ చేసినట్టు తోలిపారు. మురళికి, కస్టమర్లకి మధ్య పని చేస్తున్న 3 సర్వెంట్స్ , ఒక పిక్ అండ్ డ్రాప్ బాయ్, ఒక సెక్యూరిటీ మేనేజ్మెంట్ వ్యక్తి ఉండటం గమనార్హం. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం జరగడంతో పేకాటకి తెర లేపాడని పోలీసులు వెల్లడించారు.
గేమింగ్ ఆక్ట్ కింద కేస్ నమోదు చేశారు కేపీహెచ్బీ పోలీసులు. అధిక వడ్డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు మురళిపై ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఏకంగా 3500 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల నుండి రూ. 70 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.