డైరెక్టర్ కొరటాల శివ అనగానే సినిమా హిట్టు అన్న అభిప్రాయం ఉంటుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ కథకు సామాజిక కోణం జోడించడం తన స్టైల్. ఇలాంటి డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమా చేయాలని ఉంది అంటూ ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ బ్యానర్ లో తన వద్ద శిష్యరికం చేసే వారికి అవకాశం ఇస్తారు.
ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొరటాల ఈ కామెంట్స్ చేశారు. మాములుగా ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యాక రెండ్రోజులకు కానీ హిట్ అయ్యిందా కాదా తెలియదు కానీ ఉప్పెన మాత్రం రిలీజ్ కు ముందే హిట్ వైబ్రేషన్స్ ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.