రాజకీయాలు తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ 150 , సైరా సినిమాల వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాడు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తరువాత పట్టాలెక్కనుంది.కొరటాల మాములుగా తన సినిమాల్లో హీరోలను స్టైల్ గా, డిఫరెంట్ గా చూపిస్తాడు.
ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్న కొరత చిరుని స్క్రీన్ పై స్టైలిష్ గా చుపించాలనుకున్నాడట. ఆ లుక్ కోసమే సినిమాని కూడా వెనక్కి పోస్టుపోన్ చేసుకున్నాడట. గతంలో ఓ రెండు సార్లు చిరు లుక్ చూసిన కొరటాల సంతృప్తి చెందలేదట, తాజాగా చిరు లుక్ కొరటాల అనుకున్న విదంగా వచ్చిందట. అది చుసిన కొరత శివ కూడా సంతృప్తి చెందాడని సమాచారం. ఇక ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.