సినిమా చేశామంటే చాలు సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడమే అన్నట్టుగా కొరటాల శివ చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. ఇప్పటికి అపజయం పలకరించలేదు ఆయనను. సక్సెస్ కు పర్యాయపరంగా మారిపోయాడు కొరటాల శివ. ఇండస్ట్రీలో రాజమౌళి తరువాత అపజయాలను ఖాతాలో వేసుకుకోండా ముందుకు సాగుతోన్న డైరక్టర్ ఎవరన్నా ఉన్నారంటే కొరటాల శివే అని టక్కున చెప్తారు. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు. ఆయనతో సినిమాలు అంటే స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొరటాల శివ ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తుండగానే.. ఆయనతో సినిమా చేసేందుకు మహేష్ బాబు, ఎన్టీఆర్ లు ఆసక్తి చూపిస్తున్నారు.
మహేష్ బాబుతో కొరటాల శివ చేసిన రెండు సినిమాలు దుమ్మురేపాయి. శ్రీమంతుడు సినిమా అన్ని వర్గాల ప్రశంసలను అందుకోగా.. ‘భరత్ అనే నేను’ మహేష్ బాబు కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అందువల్ల మరోసారి ఆ స్టార్ డైరక్టర్ తో సినిమా చేసేందుకు మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఆయనతో సినిమా కంప్లీట్ చేసి కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లనున్నారు మహేష్ బాబు.