కొరటాల శివ… ఆచార్య సినిమా ముందు వరకు వరుస సక్సెస్ అందుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అదే హైప్ తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. రిలీజ్ కి ముందు విపరీతమైన ప్రమోషన్స్ చేశారు. ఆ విధంగానే హైప్ కూడా నెలకొంది.
కట్ చేస్తే చిరంజీవి కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ మూవీ గా మిగిలింది. చిరంజీవి అభిమానుల సైతం ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ సెటిల్మెంట్ ఆఫర్ చేశారు. ఈ సెటిల్మెంట్ లో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లు తిరిగి ఇచ్చేసారట కొరటాల. ఇక ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. అయితే వారు ఈ ప్రాజెక్టు నుంచి మధ్యలో తప్పుకున్నారు.
బాలయ్య సమరసింహారెడ్డి కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీంతో కొరటాల నిర్మాణ భాగస్వామిగా ఉండి ఆచార్య తెరకెక్కించారు. సినిమా నెగిటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయి. దీనితో బయ్యర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం కోసం కొరటాల ఓ ప్రాపర్టీ అమ్మేశారు. 15 కోట్లు చెల్లించాల్సి ఉండగా కొరటాల అలా ఆస్తి అమ్ముకొని ఫెయిల్యూర్ బాధ్యత తీసుకున్నాడు.
మహేష్ సినిమాకు పూజా కండిషన్స్….ఫ్యాన్స్ ఫైర్
నిజానికి 2013లో విడుదలైన మిర్చి సినిమాతో దర్శకుడుగా మారారు కొరటాల. రెండో చిత్రం శ్రీమంతుడు ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మహేష్ తో భరత్ అనే నేను ఇలా వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఆచార్య సినిమా రిలీజ్ కి ముందు 120 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో 40 కోట్ల వరకు రాబెట్టింది.