జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. కోరుట్లలోని ఓ షాపింగ్ మాల్ లో మంటలు ఎగిసిపడ్డాయి. వస్త్ర దుకాణంలో మొదలైన మంటలు తర్వాత భవనం అంతా వ్యాపించాయి.
స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన సిబ్బంది దాదాపు 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు.
నాలుగు అంతస్తుల్లో ఉన్న షాపింగ్ మాల్ లోని ఫర్నీచర్, ఇతర సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. భారీగానే ఆస్తినష్టం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.