తెలుగు సినీ ఇండస్ట్రీలో కోటా శ్రీనివాస రావు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఒక లెజెండరీ నటుడు. ఎన్నో మూవీల్లో అనేక భిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నారు. కామెడీ, విలన్ రోల్స్‌లో కోటా అద్భుతంగా నటిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. వయస్సు అయిపోతుండడం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఎప్పుడో ఒక సినిమాలో కనిపిస్తున్నారు.
అయితే కోటా ఇటీవలే పలువురు నటులు, దర్శకులను మూవీ ఆఫర్ల కోసం అడిగారు. లాక్ డౌన్ సమయంలో నెలల తరబడి ఇంట్లో ఉండి బోర్ కొట్టిందని, అందువల్ల తనకు మూవీల్లో ఆఫర్లు ఇవ్వాలని కోరుతూ కోటా.. ఇటీవలే చిరంజీవి, పవన్ కల్యాణ్‌తోపాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, వీవీ వినాయక్‌లను అడిగారు. దీంతో వారు సరేనన్నారు. ఈ క్రమంలో కోటా వారి మూవీల్లో త్వరలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
కోటా శ్రీనివాస రావు రిక్వెస్ట్ చేయడం వల్ల పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లులో ఆయనకు కీలకపాత్ర వచ్చింది. ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మిగిలిన నటులు, దర్శకుల మూవీల్లోనూ కోటా నటించబోతున్నారని తెలిసింది. దీంతో ప్రేక్షకులు కూడా ఆయన నటించే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా కోటా శ్రీనివాస రావు ఇటీవలే రాజ్ తరుణ్ యాక్షన్ థ్రిల్లర్ పవర్ ప్లేలో సీఎంగా కనిపించి అలరించారు.