సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుగారి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో నేడు చర్చ జరుగుతోంది. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవలే నటుడు చలపతిరావు మరణించినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ కుటుంబాన్ని కూడా కోటగారు పరామర్శించారు.
తాజాగా ఆయన ఓ సినిమాలో కూడా నటించారు. ఆ ఫొటో బయటకు వచ్చింది. దానితో ఆయన ఆరోగ్యం బాగోలేదని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి నాకు కూడా తెలిసిందన్నారు.
ఆయనకు తెలిసిన వారందరూ కూడా ఫోన్లు చేస్తుండడంతో వాటికి స్వయంగా ఆయనే సమాధానం చెబుతున్నట్లు ఆయన వివరించారు. ఉదయం ఇంటి వద్దకు పోలీసులు కూడా చేరుకున్నట్లు ఆయన చెప్పారు. స్వయంగా ఆయనే పోలీసు వారితో మాట్లాడి వారిని అక్కడ నుంచి పంపివేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు రాతలు, ప్రచారాలు చేసే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దీనిపై కోట శ్రీనివాసరావు మేనేజర్ సురేష్ కూడా ఓ ప్రకటన చేశారు. కోట శ్రీనివాసరావు గారి తో ఇప్పుడే మాట్లాడాను ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు అని తెలిపారు.