ఎవరినడిగి గవర్నర్ ఆమోదం తెలిపాడు – టీడీపీ సమన్వయ కార్యదర్శి నాగేంద్ర కుమార్
రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజల ప్రయోజనాల కోసం కాదని జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకుల కోసమేనని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ సమన్వయ కార్యదర్శి నాగేంద్ర కుమార్. విశాఖ సింహాచలం భూములు పై వైసీపీ కన్ను పడిందని వాటిని దోచుకోవడం కోసమే మూడు రాజధానులు డ్రామా జగన్ ఆడుతున్నారని నాగేంద్ర కుమార్ తెలిపారు.
బిజెపి జనసేన వైసిపి పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని మూడు రాజధానులు విషయంలో గవర్నర్ ఎవరు తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం చేతిలో గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ ఫెయిల్ అయ్యారని తొలివెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఇవే కాకుండా రాజధాని విషయమై మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే