శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ లో నివసం ఉంటున్న ప్రముఖ శిల్పి… కళాకారుడు కొత్తపల్లి రమేష్ మరోసారి తన మెదడుకు పదును పెట్టారు. అద్భుతమైన శ్రీరామ బాణాన్ని మరియు లాక్ డౌన్ నమూనాను 22 క్యారెట్ల బంగారం తో కేవలం 450 రూపాయల విలువ చేసే కళాకృతులను తయారు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు తన సూక్ష్మ కళ్ళతో చక్కని సందేశాన్ని తెలియజేశారు .ప్రజల ఇల్లు దాటి బయటకు రాకూడదని ప్రతి ఒక్కరు విధిగా లాక్ డౌన్ పాటించాలని వుండాలని తెలియజేస్తూ ఈ శ్రీరామ బాణం లాక్ డౌన్ పాటించిన ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష ల కాపాడుతుందని ప్రజలందరూ లాక్ పాటించాలని సందేశం ఇచ్చారు.
ఈ బంగారు రామ బాణానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని దీనికొరకు 140 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించినట్లు తెలిపారు దీని విలువ సుమారు 450 రూపాయలు గల బంగారాన్ని వినియోగించినట్టు తెలియజేశారు ఈ రామబాణం కొలతలు ఎత్తు రెండు సెంటీమీటర్లు వెడల్పు 1.5 సెంటీమీటర్లుని తెలిపారు.