స్కూళ్లు తెరుచుకున్నాయి.. పిల్లలు బడి బాట పట్టారు. అలాగే వర్షం రానే వచ్చింది. పాఠశాల ఆవరణలు బురదమయం అయ్యాయి. కనీసం నడిచేందుకు సరైన దారి కూడా లేని దుస్థితి కొన్ని స్కూళ్లలో కనిపిస్తోంది. బంగారు తెలంగాణలో పిల్లల అవస్థలు అన్నీ ఇన్నీ కావని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ స్కూల్ ది. వర్షానికి పాఠశాల ఆవరణ మొత్తం బురదమయంగా మారింది. దీంతో విద్యార్థులు అందులోనే నడుచుకుంటూ తరగతి గదుల్లోకి వెళ్తున్నారు.
ఇక్కడ వర్షం పడితే వరద నీరు బయటికి పోవటానికి వీలు లేకుండాపోయింది. దీంతో నీళ్లన్నీ స్కూల్ ఆవరణలోనే నిలిచిపోతున్నాయి. అవి ఇంకిపోయాక అక్కడంతా బురదమయంగా మారుతోంది. దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు దీనిపై స్పందించి వర్షపు నీటిని బయటికి వెల్లేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. మన ఊరు మన బడి పేరుతో స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. ఆచరణలో అది సరిగ్గా సాధ్యం కావడం లేదని అంటున్నారు విద్యావేత్తలు.