కొట్టం మధుసూదన్ రెడ్డి, రెడ్డి జాగృతి
కొండలను, గుట్టలను మీరు సృష్టించారా చెప్పండిరా? ఇప్పటికే ప్రకృతి నాశనం చేసుకుని ప్రతిరోజు మరణపు అంచుల్లో ఉన్నా కూడా బుద్ధి రావడం లేదు ప్రభుత్వానికి. మైనింగ్ అనుమతులు వెనక్కి తీసుకోకపోతే ప్రజలంతా ప్రభుత్వం పైతిరగబడతారు జాగ్రత్త..!రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ ప్రాంతంలోని శ్రీశైలం హైవే పక్కనున్న ఆకుతోటపల్లి గ్రామం లోని సర్వే నెంబర్ 304 లో ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల అందమైన కొండలు ,గుట్టలను పేల్చివేసి ,పిప్పిచేసి అందులోని అపార ఖనిజాన్ని తవ్వుకుని సమాదిచేస్తామని ప్రభుత్వఅధికారుల సమాచారం అండదండలతో ఎవడో దరఖాస్తు చేసుకుంటే వాడికి రేపో ,మాపో అప్పచెప్పడానికి సర్వం సిద్ధం చేశారు ప్రభుత్వ అధికారులు.
ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి , ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆ కొండలపై జీవించి , ఆ కొండలు గుట్టలో పశువులు మేపుకుని పశుసంపధతో బతుకుతున్న ప్రజల జీవనాన్ని దెబ్బతీసేవిధంగా , ఆలవాలంగా ఉన్న కొండల్ని, ప్రజల నమ్మకానికి ప్రతిరూపమైన ఆ కొండల్లోని శ్రీ రాముల వారి గుడిని కూల్చివేసేవిధంగా , ఆ కొండలు గుట్టలో వర్షాలొస్తే ఆ ప్రాంతం మొత్తం భూగర్భజలాలు పెరిగి ఆ నీటితో సహజసిద్ధమైన వ్యవసాయం చేసుకుంటూ సంప్రదాయ, ఆరోగ్యకర జీవనాన్ని దెబ్బతీసేవిధంగా మైనింగ్ కి అనుమతి ఎలా ఇస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. మళ్ళీ ఆ సహజసిద్ధ కొండల్ని, గుట్టల్ని పునర్మిస్తారా? ఆ ప్రాంత ప్రజల జీవనానికి వెలకట్టగలరా చెప్పాలి.
ఏది ఏమైనా స్వార్థఅధికారుల సహకారం తో మీరిచ్చిన మైనింగ్ అనుమతుల్ని రద్దు చేయాల్సిందే.