ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. విదేశాలకు వెళ్లాలన్నా… లేదంటే మన దేశంలో కూడా కొన్ని మాల్స్ లోకి వెళ్లాలన్నా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అడుగుతున్నారు. అలాగే రైలు ప్రయాణం, విమాన ప్రయాణం చేయాలంటే కోవిడ్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరి అయింది. అయితే ఈ సర్టిఫికెట్ ఎప్పుడూ మనతోనే తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. కొన్నిసార్లు మర్చిపోవచ్చు… లేదా సర్టిఫికెట్ పోవచ్చు అయితే సర్టిఫికెట్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisements
వాట్సాప్ నుండే సర్టిఫికెట్ ను ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మందవీయ చెప్పారు. ఈ సర్టిఫికెట్ కావాలనుకునే వారు ముందుగా +919013151515 నంబర్ ను సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కోవిడ్ సర్టిఫికెట్ అని టైప్ చేయాలి. ఆ తరవాత ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేయగానే కొన్ని సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. వచ్చిన సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసి జిరాక్స్ కూడా తీసుకోవచ్చు.