కొజికోడ్ విమాన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 56 మంది కోలుకున్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని ఈ మేరకు డిశ్చార్జ్ చేసినట్టు ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన మొత్తం 149 మందిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చారు. శనివారం 23 మంది డిశ్చార్జి కాగా..ఇవాళ మరో 33 మందిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టు వెల్లడించింది.
శుక్రవారం సాయంత్రం 190 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం కొజికోడ్‌లో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది. 35 అడుగుల లోయలోకి జారిపోయి రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా 18 మంది దుర్మరణం చెందారు