ఈ ఏడాది సూపర్ హిట్ మూవీల్లో ఫస్ట్ ప్లేసులో ఉన్న సినిమా క్రాక్. కానీ సినిమా రిలీజ్ రోజు నుండి వివాదాలు ఎదుర్కొంటూనే ఉంది. ఫైనాన్షియల్ కారణాలతో సినిమా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ, సూపర్ సక్సెస్ తో వార్తల్లో నిలిచింది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో రవితేజ, హీరోయిన్ శృతి హసన్ లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డైరెక్టర్ గోపిచంద్ మలినేనిని మెగాస్టార్ వంటి ప్రముఖులు అభినందించారు.
కానీ క్రాక్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. డైరెక్టర్ గోపిచంద్ దర్శక మండలిలో నిర్మాత ఠాగూర్ మధుపై ఫిర్యాదు చేశారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కు సమాధానం కూడా ఇవ్వటం లేదన్నారు. దీనిపై ఠాగూర్ మధు స్పందించారు. ఫలానా బడ్జెట్ లో మూవీ పూర్తి చేస్తానని చెప్పి, ఎక్కువ చేశారని అందుకే రెమ్యూనరేషన్ లో కోత విధించినట్లు తెలిపాడు.
క్రాక్ ను త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నారు.